హైదరాబాద్, సెప్టెంబర్ 28 (మన విశ్వం): తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కీలక దశకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 92,88,180 మంది ఓటర్లకు నోటీసులు రూపొందించగా, ఇప్పటివరకు 87,97,580 మందికి అందజేశారు. మరో 4,90,600 మందికి నోటీసులు అందాల్సి ఉంది. ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలు, 2002 నాటి జాబితాతో వివరాలు సరిపోలని కేసులే ప్రధానంగా ఈ నోటీసుల పరిధిలో ఉన్నాయి.
నోటీసుల పరిష్కార ప్రక్రియలో ఇప్పటివరకు 59,51,696 మంది ఓటర్లకు సంబంధించి విచారణ పూర్తయింది. వీరిలో 46,10,367 మందిని ఈఆర్వో/ఏఈఆర్వో స్థాయిలో తుది ఓటర్ల జాబితాలో చేర్చేందుకు క్లియర్ చేశారు. అయితే ఈ దశలో క్లియరెన్స్ రాని వారి పేర్లు తొలగిపోయినట్లు కాదని ఎన్నికల యంత్రాంగం స్పష్టం చేస్తోంది. ఆయా కేసుల్లో పత్రాల పరిశీలన తదుపరి స్థాయిలో కొనసాగుతోంది.
అనర్హులు 4,570 మందే!
92.88 లక్షల మందికి నోటీసులు జారీ కావడంతో పెద్ద సంఖ్యలో ఓట్లు తొలగిపోతాయనే ఆందోళనకు తాజా గణాంకాలు కీలకంగా మారాయి. ఇప్పటివరకు పరిశీలించిన వాటిలో తుది జాబితాలో చేర్చేందుకు అనర్హమైనవిగా తేలిన ఎంట్రీలు 4,570 మాత్రమే. మరో 4,12,923 కేసులు జిల్లా ఎన్నికల అధికారుల వద్ద పరిశీలనలో ఉండగా, 19,85,343 మంది ఓటర్ల పరిశీలన డీఈవో స్థాయిలో పూర్తయింది.
8.38 లక్షల దరఖాస్తులు
క్లెయిమ్స్, అభ్యంతరాల ప్రక్రియలో ఇప్పటివరకు 8,38,558 దరఖాస్తులు అందాయి. కొత్త ఓటరు నమోదుకు ఫారం-6 ద్వారా 4,43,705, వివరాల సవరణకు ఫారం-8 ద్వారా 3,57,898, పేర్ల తొలగింపునకు ఫారం-7 ద్వారా 30,676 దరఖాస్తులు వచ్చాయి. ప్రవాస భారతీయుల నమోదుకు ఫారం-6ఏ ద్వారా మరో 6,279 దరఖాస్తులు అందాయి.
రాష్ట్రంలో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 3,04,354 క్లెయిమ్స్, అభ్యంతరాలు నమోదయ్యాయి. మేడ్చల్-మల్కాజిగిరిలో 1,16,752, రంగారెడ్డి జిల్లాలో 1,15,444 దరఖాస్తులు వచ్చాయి. అత్యల్పంగా ములుగు జిల్లాలో 836 నమోదయ్యాయి.
నోటీసు అంటే ఓటు పోయినట్లు కాదు
ఎస్‌ఐఆర్ నోటీసు అందిందంటే ఓటు తొలగించినట్లు కాదు. ఓటరు వివరాల్లో గుర్తించిన వ్యత్యాసాలను సరిచేయడం, అర్హతను నిర్ధారించేందుకు అవసరమైన పత్రాలను పరిశీలించడమే నోటీసుల ప్రక్రియలో కీలకం. అవసరమైన పత్రాలను సమర్పించిన తర్వాత ఈఆర్వో, ఏఈఆర్వో స్థాయిలో నిర్ణయం తీసుకుంటారు. అవసరమైన కేసులను జిల్లా ఎన్నికల అధికారుల స్థాయికి పంపుతున్నారు.
క్లెయిమ్స్, అభ్యంతరాలకు అక్టోబర్ 7 వరకు అవకాశం ఉండగా, నోటీసుల పరిష్కార ప్రక్రియ నవంబర్ 5 వరకు కొనసాగనుంది. దీంతో 92.88 లక్షల నోటీసుల్లో చివరకు ఎంతమంది తుది ఓటర్ల జాబితాలో కొనసాగుతారు? ఎన్ని కేసులు అనర్హంగా తేలుతాయి? అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.