నల్లబెల్లి, సెప్టెంబర్ 26(మన విశ్వం): తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను నల్లబెల్లిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా ఐలమ్మ సాగించిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని వక్తలు పేర్కొన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చూపిన ధైర్యసాహసాలు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయన్నారు. ఐలమ్మ ఆశయాలను కొనసాగిస్తూ సామాజిక సమానత్వం, మహిళా సాధికారత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాపాల లక్ష్మీనారాయణ, నాగేల్లి జ్యోతి, ప్రకాష్, కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్, మహేందర్, గోన నరహరి, ఎల్ఐసీ శంకరయ్య, ఉప సర్పంచ్ గుమ్మడి వేణు, అవునూరి కిషోర్ తదితరులతో పాటు స్థానిక నాయకులు, మహిళలు, యువత పాల్గొన్నారు.