మంచిర్యాల, (మన విశ్వం): నాడు ఎంపీ గెలుపు కోసం కలిసి నడిచారు.. నేడు అదే గెలుపును ప్రస్తావిస్తూ మాటల తూటాలు పేలుతున్నాయి. మంచిర్యాల కాంగ్రెస్‌లో కొంతకాలంగా సాగుతున్న అంతర్గత విభేదాలు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు తాజా వ్యాఖ్యలతో మరింత వేడెక్కాయి. “మా సహాయం లేకుంటే ఎంపీగా గెలిచేవాడా?”, “అందరం కలిసి గెలిపిస్తే ఇప్పుడు మమ్మల్నే ఇబ్బంది పెడుతున్నారు” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వర్గంతో నెలకొన్న విభేదాల నేపథ్యంలో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇటీవల వంశీకృష్ణ బైక్ ర్యాలీ, ఫ్లెక్సీల వివాదం తర్వాత ఇప్పుడు ప్రేమ్‌సాగర్‌రావు ఘాటు వ్యాఖ్యలు తెరపైకి రావడంతో మంచిర్యాల కాంగ్రెస్‌లో వర్గపోరు మరో మలుపు తిరిగింది.
‘గంజాయి బ్యాచ్.. జాగ్రత్త!’
“చీమల దండు కదిలింది.. గంజాయి బ్యాచ్, మంత్రగాళ్లు జాగ్రత్తగా ఉండాలి” అంటూ ప్రేమ్‌సాగర్‌రావు హెచ్చరించారు. “మా కార్యకర్తలు కాలు వేసి తొక్కితే సచ్చిపోతారు.. వాళ్లు చేయి లేపే దాకా తెచ్చుకోవద్దు” అంటూ కార్యకర్తల జోలికి రావద్దనే రీతిలో ఘాటుగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు ఇప్పటికే వేడెక్కిన స్థానిక కాంగ్రెస్ రాజకీయాల్లో మరింత చర్చకు దారితీశాయి.
‘మా సహాయం లేకుంటే గెలిచేవాడా?’
ఎంపీ ఎన్నికల ప్రస్తావనతో ప్రేమ్‌సాగర్‌రావు మరింత ఘాటుగా స్పందించారు. “మా సహాయం లేకుంటే ఎంపీగా గెలిచేవాడా? అందరం కలిసి గెలిపిస్తే ఈరోజు మమ్మల్నే ఇబ్బంది పెడుతున్నారు. పనికిమాలిన వాళ్లను వెంట వేసుకుని తిరుగుతూ కాంగ్రెస్ అనుచరులను క్షోభకు గురిచేస్తున్నారు” అంటూ మండిపడ్డారు. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో వంశీకృష్ణ గెలుపునకు ప్రేమ్‌సాగర్‌రావు బహిరంగంగా మద్దతు ప్రకటించారు. వంశీకృష్ణను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని అప్పట్లో ఆయన పిలుపునిచ్చారు. నాటి మద్దతు నుంచి నేటి పరోక్ష విమర్శల వరకు వచ్చిన మార్పు స్థానిక కాంగ్రెస్‌లో మారుతున్న రాజకీయ సమీకరణాలను చూపుతోంది.
దళితుల అంశంతో మరో మంట
“మీరు దళితుల ప్రేమికులు కాదు.. దళితులను తొక్కేసిందే మీరు” అంటూ ప్రేమ్‌సాగర్‌రావు మరో ఘాటు వ్యాఖ్య చేశారు. “నిజంగానే దళితుల పక్షమైతే దళితులతో ఒక సమావేశం పెట్టండి. వారం రోజుల్లో మీకంటే పది రెట్లు ఎక్కువ మంది దళితులతో నేను సమావేశం పెడతా” అంటూ సవాల్ విసిరారు. దీంతో అంతర్గత వర్గపోరులో దళితుల అంశం కూడా చర్చకు వచ్చింది.
వంశీ ర్యాలీ.. ఫ్లెక్సీల రగడ
ఇటీవల ఎంపీ గడ్డం వంశీకృష్ణ మంచిర్యాలలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత వంశీకృష్ణ, మంథెన జగన్మోహన్‌రావుకు మద్దతుగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల చింపివేత వివాదానికి దారితీసింది. ఈ వ్యవహారంతో స్థానిక కాంగ్రెస్‌లో వర్గాల మధ్య విభేదాలు మరింత బహిరంగమయ్యాయి.
నాడు కలిసి.. నేడు కలహం!
2024 లోక్‌సభ ఎన్నికల్లో వంశీకృష్ణ గెలుపు కోసం ప్రేమ్‌సాగర్‌రావు బహిరంగంగా మద్దతిచ్చారు. ఇప్పుడు “మా సహాయం లేకుంటే ఎంపీగా గెలిచేవాడా?” అనే స్థాయికి మాటలు చేరాయి. ఒకప్పుడు ఎన్నికల గెలుపు కోసం ఒక్కటైన నేతల మధ్య రెండేళ్లకే రాజకీయ దూరం పెరగడం మంచిర్యాల కాంగ్రెస్‌లో మారిన సమీకరణాలకు అద్దం పడుతోంది.
మంచిర్యాలలో ఎవరి పట్టు?
ఒకవైపు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఆయన కుమారుడు ఎంపీ వంశీకృష్ణ.. మరోవైపు ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు.. మధ్యలో స్థానిక నేతల వర్గ సమీకరణాలు మంచిర్యాల కాంగ్రెస్ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. బైక్ ర్యాలీ నుంచి ఫ్లెక్సీల వివాదం వరకు.. “మా వల్లే గెలుపు” నుంచి “గంజాయి బ్యాచ్ జాగ్రత్త” వరకు పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
నాడు కలిసి గెలిపించిన నేతలు.. నేడు పరోక్ష విమర్శలతో ఎదురెదురుగా నిలుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజా వ్యాఖ్యలతో మంచిర్యాల కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి రాగా.. ఎంపీ వర్గం స్పందన, పార్టీ నాయకత్వం వైఖరి ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి.