హైదరాబాద్, సెప్టెంబర్ 22 (మన విశ్వం): ప్రతిష్ఠాత్మక నిమ్స్‌లో కీలక అధికారిగా పనిచేస్తున్న డాక్టర్ నోరి లక్ష్మీ భాస్కర్ ఆస్తులపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నజర్ పెట్టింది. తెలిసిన ఆదాయ వనరులకు మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై కేసు నమోదు చేసి మంగళవారం తెల్లవారుజాము నుంచి పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టింది.
లక్ష్మీ భాస్కర్ నివాసం, నిమ్స్‌లోని కార్యాలయంతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులకు సంబంధించిన ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. సోదాల సంఖ్యపై వేర్వేరు వివరాలు వస్తుండటంతో అధికారిక ప్రకటన వెలువడే వరకు ఖచ్చితమైన సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది.
ఆస్తుల లెక్కలపై ఆరా
సోదాల్లో స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు ఖాతాలు, డిపాజిట్లు, ఆర్థిక లావాదేవీల రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. బ్యాంకు లాకర్లు, ఇతర పెట్టుబడుల వివరాలపైనా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. గుర్తించిన ఆస్తులకు చట్టబద్ధమైన ఆదాయ వనరులు ఉన్నాయా? ఆదాయానికి మించి ఆస్తులు సమకూరాయా? అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది.
తుది లెక్కలపైనే ఉత్కంఠ
సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో నగదు, బంగారం, స్థిరాస్తులు ఎంత మేర గుర్తించారు? ఆదాయానికి మించిన ఆస్తుల విలువ ఎంత? ఇతరుల పేర్లపై ఆస్తులున్నాయా? అనే అంశాలపై ఏసీబీ అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. సోదాలు పూర్తయి తుది లెక్కలు బయటకొస్తే ఈ కేసులో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.