ఆదిలాబాద్ (మావల), సెప్టెంబర్ 14 (మన విశ్వం): చదువుపై దృష్టి పెట్టాల్సిన విద్యార్థుల మధ్య చిన్న వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసిన ఘటన మావల సమీపంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మధ్య తరగతి గదిలో మాటామాటా పెరిగి పరస్పరం దాడి చేసుకునే స్థాయికి వెళ్లినట్లు సమాచారం.
వారిని నిలువరించేందుకు ప్రయత్నించిన ఉపాధ్యాయుడిని సైతం విద్యార్థులు నెట్టేసినట్లు తెలిసింది. పాఠశాల ఆవరణలో చోటుచేసుకున్న ఈ వ్యవహారం అనంతరం విద్యార్థుల తల్లిదండ్రుల దృష్టికి వెళ్లడంతో వారు పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. దీంతో పాఠశాల ప్రిన్సిపాల్‌ను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి, విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తెలిసింది.
చిన్న వయసులోనే విద్యార్థుల మధ్య ఘర్షణలు తీవ్ర రూపం దాల్చకుండా పాఠశాలల్లో క్రమశిక్షణతో పాటు కౌన్సెలింగ్, ఉపాధ్యాయులు–తల్లిదండ్రుల నిరంతర పర్యవేక్షణ అవసరమనే చర్చకు ఈ ఘటన దారితీసింది.