ఆదిలాబాద్/కుప్తి, సెప్టెంబర్ 14 (మన విశ్వం): ఆదిలాబాద్ జిల్లాలోని జాతీయ రహదారిపై ప్రయాణం వాహనదారులకు పరీక్షగా మారుతోంది. ఓవైపు వంతెన నిర్మాణ పనులు, మరోవైపు రహదారి మరమ్మతులు కొనసాగుతుండటంతో పలుచోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ మార్గంలో గంటల తరబడి వాహనాలు నిలిచిపోతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పనులు జరుగుతున్న ప్రాంతాల్లో రహదారి ఇరుకుగా మారడంతో ఎదురెదురుగా వచ్చే వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా భారీ వాహనాల రాకపోకల సమయంలో ట్రాఫిక్ మరింత స్తంభిస్తోంది. దీంతో నిర్ణీత సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.
జాతీయ రహదారి సిబ్బంది, పోలీసుల సమన్వయంతో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి వాహనాలను విడతలవారీగా పంపిస్తున్నప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడం లేదని స్థానికులు చెబుతున్నారు. వంతెన, మరమ్మతు పనులను వేగంగా పూర్తి చేసి జాతీయ రహదారిపై ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టాలని వాహనదారులు కోరుతున్నారు.