నల్లబెల్లి, సెప్టెంబర్ 14 (మన విశ్వం): పంటను కాపాడుతుందని కొనుగోలు చేసిన పొటాష్ బస్తాలో మట్టి కనిపించడంతో రైతులు లబోదిబోమంటున్నారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని గ్రోమోర్ సెంటర్‌లో కోరమండల్ పొటాష్ పేరుతో కల్తీ ఎరువు విక్రయించారంటూ రైతులు ఆరోపిస్తున్నారు. ఒక్క రైతు కొనుగోలు చేసిన మూడు బస్తాల్లోనూ మట్టి కలిసిన పదార్థం కనిపించిందని చెప్పడంతో వ్యవహారం కలకలం రేపుతోంది.
కొండాయిల్‌పల్లికి చెందిన రైతు కొనకటి రాజు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రోమోర్ సెంటర్‌లో మూడు పొటాష్ బస్తాలను ఒక్కొక్కటి రూ.2,200 చొప్పున రూ.6,600కు కొనుగోలు చేశారు. పంటకు వేసేందుకు ఒక బస్తా తెరవగా అందులో పెద్ద మొత్తంలో మట్టి కలిసినట్లు గుర్తించానని ఆయన ఆరోపించారు. వెంటనే బస్తాను కేంద్రానికి తీసుకెళ్లి నిర్వాహకులకు చూపించినట్లు తెలిపారు. అనంతరం మిగిలిన రెండు బస్తాలను పరిశీలించగా వాటిలోనూ మట్టి కనిపించిందని చెప్పారు.
150 బస్తాలు రైతుల చేతుల్లోకి?
గ్రోమోర్ గోదాముకు ఇటీవల కోరమండల్ పొటాష్ పేరుతో 294 బస్తాలు వచ్చాయని, వాటిలో యాప్ ద్వారా బుక్ చేసుకున్న రైతులకు ఇప్పటికే సుమారు 150 బస్తాలు విక్రయించారని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. ఈ లెక్క నిజమైతే ఆ బస్తాలు కొనుగోలు చేసిన రైతుల పరిస్థితి ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటికే పొటాష్‌ను పంటలకు వేసిన రైతులు ఉన్నారా? ఉంటే పంటపై ప్రభావం ఎంత? అనే అంశాలపైనా అధికారులు తక్షణమే దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.
ల్యాబ్ రిపోర్టుతో తేలాల్సిందే
అయితే బస్తాల్లో కనిపించిన పదార్థం నిజంగా నకిలీ లేదా కల్తీ ఎరువేనా అన్నది అధికారిక ప్రయోగశాల పరీక్షల్లో నిర్ధారణ కావాల్సి ఉంది. సంబంధిత ఏఓ బన్న రజితను వివరణ కోరగా, అనుమానం ఉన్న పొటాష్ నమూనాలను ల్యాబొరేటరీ పరీక్షలకు పంపిస్తామని తెలిపారు. నివేదికలో నకిలీ లేదా నాణ్యతా లోపం నిర్ధారణైతే సంబంధిత గ్రోమోర్ కేంద్రంపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
రైతుల డిమాండ్ ఇదే..
విక్రయించిన బ్యాచ్‌కు సంబంధించిన స్టాక్‌ను తక్షణమే పరిశీలించాలని, మిగిలిన బస్తాల విక్రయాలను పరీక్షల ఫలితాలు వచ్చే వరకు నిలిపివేయాలని రైతులు కోరుతున్నారు. ఇప్పటికే విక్రయించిన బస్తాల వివరాలను గుర్తించి నమూనాలు సేకరించాలని డిమాండ్ చేస్తున్నారు. పరీక్షల్లో కల్తీ నిర్ధారణైతే బాధ్యులపై కఠిన చర్యలతో పాటు నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని కోరుతున్నారు.