కొమరం భీం, సెప్టెంబర్ 13 (మన విశ్వం): రాజకీయ విమర్శలు చేసుకోండి.. ప్రజా సమస్యలపై ప్రశ్నించుకోండి.. కానీ వ్యక్తిగత దూషణలకు దిగితే మాత్రం కేసులు తప్పవని కాగజ్‌నగర్ డీఎస్పీ వహీదుద్దిన్ రాజకీయ పార్టీల నేతలను హెచ్చరించారు. ప్రెస్‌మీట్లలో ఒకరిపై మరొకరు వ్యక్తిగత ఆరోపణలు చేయడం, అనుచిత వ్యాఖ్యలకు దిగడం, సోషల్ మీడియాలో అవమానకర పోస్టులు పెట్టడం మానుకోవాలని స్పష్టం చేశారు.
రాజకీయంగా విధానాలు, ప్రజా సమస్యలపై విమర్శలు చేసుకునే స్వేచ్ఛ ఉందని, అయితే వ్యక్తులను కించపరిచే వ్యాఖ్యలు, పరస్పర దూషణలు శాంతిభద్రతల సమస్యగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాంటి ఘటనలు పోలీసుల దృష్టికి వస్తే సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వివాదాస్పద పోస్టులతో పరిస్థితులను ఉద్రిక్తంగా మార్చొద్దని డీఎస్పీ సూచించారు. రాజకీయ నేతలతో పాటు ప్రజలూ సంయమనం పాటించాలని కోరారు.