చిట్టి గుండెలకు వైద్యులు కొత్త ఊపిరి పోశారు. పుట్టుకతోనే గుండె జబ్బులతో బాధపడుతున్న 19 మంది చిన్నారులకు నిమ్స్ వైద్య బృందం విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించింది. వీరిలో కేవలం రెండు కిలోల బరువున్న రెండు నెలల పసికందు కూడా ఉండటం విశేషం.
నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఆధ్వర్యంలో ఈ నెల 6 నుంచి 12 వరకు నిర్వహించిన పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీ క్యాంప్‌లో మొత్తం 19 మంది చిన్నారులకు శస్త్రచికిత్సలు చేశారు. అత్యంత తక్కువ బరువున్న రెండు నెలల పసికందుకు సైతం విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించడం వైద్య బృందం నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచింది.
క్యాంప్ విజయవంతంగా ముగిసిన సందర్భంగా వైద్యులు డాక్టర్ డి. రమణ ధన్నపునేని, డాక్టర్ ఎం. అమరేష్‌రావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. చిన్నారులకు విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించిన వైద్య బృందాన్ని సీఎం అభినందించారు. ముఖ్యంగా రెండు కిలోల బరువున్న పసికందుకు చేసిన శస్త్రచికిత్సను ప్రస్తావిస్తూ వైద్యులను ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్‌కుమార్ పాల్గొన్నారు.