‘‘మాటల్లో కోతలు.. ఉద్యోగుల వేతనాల్లో కోతలు.. ఇదేనా రేవంత్‌రెడ్డి చెప్పే ప్రజాపాలన?’’ అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వంపై మండిపడ్డారు. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో 20–25 ఏళ్లుగా పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలపై ప్రభావం చూపేలా జారీ చేసిన G.O.Rt.No.1181 ఉద్యోగుల పాలిట శాపంగా మారిందని ఆరోపించారు.
సుదీర్ఘకాలంగా ప్రభుత్వ వ్యవస్థలో భాగమైన వారి సేవలు, అనుభవాన్ని గుర్తించాల్సింది పోయి కొత్త నిబంధనల పేరుతో జీతాలు తగ్గించడం అన్యాయమన్నారు. ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా 31 వేల మంది ఉద్యోగుల కుటుంబాలపై ఆర్థిక భారం మోపుతుందని పేర్కొన్నారు. ‘‘బీఆర్ఎస్ హయాంలో వేతనాల పెంపు.. కాంగ్రెస్ పాలనలో వేతనాల్లో కోతలు. ఇది ప్రజాపాలన కాదు.. ప్రజాపీడన’’ అని విమర్శించారు.
ప్రభుత్వం వెంటనే జీవో 1181ను రద్దు చేసి పూర్వపు హోదాను కొనసాగించాలని, వేతన రక్షణ కల్పించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రెగ్యులర్ పోస్టుల భర్తీలో అర్హత, సుదీర్ఘ అనుభవం ఉన్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.