కొమురం భీం, సెప్టెంబర్ 12 (మన విశ్వం): సిర్పూర్‌లో రాజకీయం భగ్గుమంటోంది. ఓవైపు కాంగ్రెస్ ఎమ్మెల్సీ దండే విఠల్ వర్గం.. మరోవైపు బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వర్గం.. ‘నువ్వా.. నేనా!’ అన్నట్లుగా తలపడుతున్నాయి. మాటకు మాట.. పోస్టుకు పోస్టు.. వీడియోకు వీడియోతో పరస్పరం రాజకీయ అస్త్రాలు సంధించుకుంటుండటంతో నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ అమాంతం పెరిగింది.
నిన్నటివరకు సోషల్ మీడియా పోస్టులు, విమర్శలు, కౌంటర్లకే పరిమితమైన పోరు ఇప్పుడు పోటాపోటీ ప్రెస్‌మీట్ల వరకు చేరింది. ఒక వర్గం ఆరోపణలు చేస్తే.. మరో వర్గం వెంటనే కౌంటర్‌కు దిగుతోంది. నాయకుల మధ్య మొదలైన మాటల యుద్ధంలో కార్యకర్తలూ రంగంలోకి దిగడంతో రాజకీయ రచ్చ మండలాలకూ పాకుతోంది.
విఠల్ వర్సెస్ కోనప్ప!
సిర్పూర్ రాజకీయాల్లో ప్రస్తుతం ఎమ్మెల్సీ దండే విఠల్, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వర్గాల మధ్య ఆధిపత్య పోరే హాట్‌టాపిక్‌గా మారింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ శ్రేణులు సోషల్ మీడియాను ప్రధాన అస్త్రంగా మార్చుకుంటున్నాయి. ఆరోపణలకు కౌంటర్ వీడియోలు.. వాటికి మళ్లీ ప్రత్యుత్తర పోస్టులు.. ఆ వెంటనే మీడియా సమావేశాలు అన్నట్లుగా రాజకీయ వేడి కొనసాగుతోంది.
హద్దులు దాటుతున్న మాటలు!
రాజకీయ విమర్శలుగా మొదలైన పోరు క్రమంగా వ్యక్తిగత ఆరోపణల వైపు మళ్లుతోందన్న చర్చ స్థానికంగా సాగుతోంది. ఇరువర్గాల శ్రేణులు దూకుడుగా వ్యవహరిస్తుండటంతో ఈ మాటల యుద్ధం క్షేత్రస్థాయిలో ఉద్రిక్తతలకు దారితీయకుండా ముఖ్య నేతలు సంయమనం పాటించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరి.. ప్రజా సమస్యల సంగతేంటి?
ఈ రాజకీయ రచ్చ మధ్య నియోజకవర్గ ప్రజల సమస్యలు పక్కకు పోతున్నాయన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. అభివృద్ధి, రోడ్లు, సాగునీరు, ఉపాధి, ఇతర స్థానిక సమస్యల పరిష్కారంలో పోటీపడాల్సిన అధికార–ప్రతిపక్షాలు పరస్పర విమర్శలకే ప్రాధాన్యం ఇస్తున్నాయన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఈ పోరు ఎక్కడిదాకా?
ఇప్పటివరకు పోస్టులు, వీడియోలు, ప్రెస్‌మీట్ల రూపంలో సాగుతున్న ‘విఠల్ వర్సెస్ కోనప్ప’ సమరం మున్ముందు మరింత ముదురుతుందా? రాబోయే రాజకీయ సమీకరణాల్లో ఎవరిది పైచేయి అవుతుంది? అన్నది ఇప్పుడు సిర్పూర్‌లో ఆసక్తికరంగా మారింది.