మంచిర్యాల, సెప్టెంబర్ 11 (మన విశ్వం): భూమి మ్యుటేషన్, పట్టాదారు పాస్‌బుక్ జారీ కోసం రూ.10 వేల లంచం తీసుకున్న కేసులో మంచిర్యాల జిల్లా కాసిపేట మండల తహసీల్దార్ అలుగునూరి రోశయ్యకు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 2013లో నమోదైన ఈ కేసులో దాదాపు 13 ఏళ్ల తర్వాత తీర్పు వెలువడింది.
కరీంనగర్‌లోని ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి నామ సంతోష్‌కుమార్ గురువారం తీర్పు వెలువరించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కింద రెండేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5 వేల జరిమానా విధించారు. సెక్షన్ 13(1)(డి) రెడ్‌విత్ 13(2) కింద కూడా రెండేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5 వేల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో ఆయా నేరాలకు మూడు నెలల చొప్పున సాధారణ జైలు శిక్ష అనుభవించాలని కోర్టు పేర్కొంది.
2013 జనవరి 9న కాసిపేట తహసీల్దార్‌గా పనిచేస్తున్న రోశయ్య.. ఫిర్యాదుదారుడి వ్యవసాయ భూమిని రెవెన్యూ రికార్డుల్లో అతని పేరుపై మ్యుటేషన్ చేయడం, పట్టాదారు పాస్‌బుక్ జారీ చేయడం కోసం రూ.10 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరించినట్లు ఏసీబీ కేసు నమోదు చేసింది. విచారణలో అభియోగాలు రుజువు కావడంతో న్యాయస్థానం ఆయనను దోషిగా నిర్ధారించి శిక్ష ఖరారు చేసింది.