‘ఫ్యూచర్ సిటీ’ పేరుతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన కుటుంబ సభ్యులకు మేలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికా పర్యటనలో తెలంగాణకు పెట్టుబడులు తెస్తున్నామంటూ సొంత సోదరులతోనే ఒప్పందాలు చేసుకున్నారని విమర్శించారు. ఫోర్త్ సిటీలో టెసెరాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్‌కు కేటాయించిన భూములను మాజీ మంత్రి హరీశ్‌రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
‘రూ.200 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.7 కోట్లకే టెసెరాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్‌కు కట్టబెట్టారు. ఇదేనా ప్రజాపాలన?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. అమెరికా పర్యటనలో ‘ది గ్రేట్ అనుముల రేవంత్‌రెడ్డి.. ది గ్రేట్ పారిశ్రామికవేత్త అనుముల జగదీశ్వర్‌రెడ్డితో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు’ అంటూ ఎద్దేవా చేశారు. ‘అనుముల జగదీశ్వర్‌రెడ్డికి రూ.వెయ్యి కోట్లు.. అనుముల కొండల్‌రెడ్డికి రూ.250 కోట్లు ఇవ్వడమేనా ప్రజాపాలన?’ అని నిలదీశారు.
బీజేపీ ఎందుకు మౌనం?
‘అనుముల అన్నదమ్ముల వ్యవహారం గురించి బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదు?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఏటీఎంగా మార్చుకుందని బీజేపీ నేతలే ఆరోపిస్తున్నప్పుడు.. చర్యలు తీసుకోవాల్సిన కేంద్ర హోంమంత్రి ఎక్కడున్నారని నిలదీశారు. ఇజ్రాయెల్‌తో కేంద్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటే రాహుల్‌గాంధీ ప్రధాని మోదీని ప్రశ్నించారని, అదే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇజ్రాయెల్‌తో ఒప్పందాలు చేసుకుంటే కేంద్రం ఎందుకు స్పందించడం లేదన్నారు. ఈడీ, సీబీఐ విచారణలకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు.
‘ఫ్యూచర్ సిటీ ఓ మాయ’
ఫ్యూచర్ సిటీ భవిష్యత్తులో నిలవదని కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో ఫార్మా సిటీ కోసం నిర్దిష్ట షరతులతో భూములు సేకరించారని, వాటిని మరో అవసరానికి వినియోగిస్తే న్యాయపరమైన సమస్యలు తలెత్తుతాయని వాదించారు. ‘ఫ్యూచర్ సిటీ అనేది మాయ. రేపటి రోజున నిలవదు.. చెల్లదు’ అని వ్యాఖ్యానించారు.
‘ఫ్యూచరే లేని సీఎం తన అన్నదమ్ముల కోసం ఆడుతున్న నాటకంలో పెట్టుబడిదారులు బలిపశువులు కావద్దు. ఇక్కడ జరుగుతున్న రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో ఇరుక్కుంటే.. మేం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట నష్టపోయేది పెట్టుబడిదారులే’ అని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లాలో ఊరూరా సదస్సులు నిర్వహించి ‘ఫ్యూచర్ సిటీ మాయ’ గురించి ప్రజలకు వివరిస్తామని ప్రకటించారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపైనా కేటీఆర్ విమర్శలు చేశారు. రేవంత్‌రెడ్డిని చూసి పొంగులేటి కూడా ‘రాఘవ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్’ ప్రారంభించారని వ్యాఖ్యానించారు. ఇలాంటి అంశాలను శాసనసభలో ప్రశ్నిస్తామనే భయంతోనే తమను సస్పెండ్ చేశారని ఆరోపించారు. ‘సస్పెన్షన్లకు భయపడేది లేదు. సభలో గొంతు నొక్కితే ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ప్రభుత్వ అవినీతి, అక్రమాలుగా మేం భావిస్తున్న ప్రతి అంశాన్నీ ప్రజల ముందుకు తీసుకెళ్తాం’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.