మూడు రోజుల అసెంబ్లీ పరిణామాలపై తాను చేయించిన ఫ్లాష్ సర్వేలో బీఆర్ఎస్ గ్రాఫ్ బాగా పడిపోయినట్లు తేలిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నట్లు సమాచారం. కాంగ్రెస్‌కు ప్రజాదరణ పెరిగిందని, సభలో మంత్రులు, విప్‌లు, ఎమ్మెల్యేలు సమన్వయంతో బాగా పనిచేశారని ప్రశంసించినట్లు తెలిసింది. ఇదే దూకుడును కొనసాగిస్తూ ప్రతిపక్ష ఆరోపణలను వాస్తవాలతో తిప్పికొట్టాలని సూచించారు.
గురువారం జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో అసెంబ్లీ పరిణామాలు, 22ఏ భూముల వివాదం, ప్రతిపక్ష వ్యూహం తదితర అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నేడు 22ఏపై అసెంబ్లీలో చర్చ జరగనున్న నేపథ్యంలో పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది.
కోటి ఎకరాల ప్రచారంపై కౌంటర్
22ఏ పరిధిలో ఉన్న భూములన్నీ వివాదాస్పద ప్రైవేటు భూములు కావని సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం. భూ భారతి పరిధిలో అటవీ, అసైన్డ్, ప్రభుత్వ భూములతో పాటు ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, శిఖం భూములు వంటి రిజిస్ట్రేషన్లకు నిషేధం ఉన్న అనేక కేటగిరీల భూములు ఉన్నాయని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
ప్రభుత్వం–వ్యక్తుల మధ్య యాజమాన్య హక్కుల వివాదం ఉన్న ప్రైవేటు భూముల విస్తీర్ణం మాత్రం విపక్షాలు ప్రచారం చేస్తున్న స్థాయిలో లేదని సమావేశంలో వివరించినట్లు తెలిసింది. వివాదాస్పద భూములపై వచ్చిన దరఖాస్తులను రెవెన్యూ రికార్డుల ఆధారంగా ఒక్కో కేసును పరిశీలిస్తున్నట్లు సమాచారం. నిషేధిత కేటగిరీల భూములను కూడా ప్రైవేటు వివాదాస్పద భూములతో కలిపి చూపుతూ బీఆర్ఎస్, బీజేపీ ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని సీఎం ఆరోపించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీనిపై అసెంబ్లీలో అధికారిక వివరాలు, రికార్డులతో సమాధానం ఇవ్వాలని సూచించినట్లు తెలిసింది.
హరీశ్ భూముల లెక్క బయటకు!
22ఏపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు ధరణి రికార్డులతో సమాధానం ఇస్తామని రేవంత్ పేర్కొన్నట్లు సమాచారం. ధరణిలో మాజీ మంత్రి హరీశ్‌రావు రాయించుకున్న భూముల వివరాలను బయటపెడతామని, ఇతర బీఆర్ఎస్ ముఖ్య నేతలకు సంబంధించిన భూముల చిట్టా కూడా సిద్ధంగా ఉందని చెప్పినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే సీఎం ప్రస్తావించిన భూములకు సంబంధించిన వివరాలు, రికార్డులు ఇంకా బహిరంగంగా విడుదల కావాల్సి ఉంది.
నేడు సభలో 22ఏపై జరిగే చర్చలో ప్రతిపక్ష ఆరోపణలను రికార్డులు, వాస్తవాలతో ఎదుర్కోవాలని సీఎం సూచించినట్లు సమాచారం. ఎమ్మెల్యేలంతా సభకు హాజరై చర్చల్లో చురుగ్గా పాల్గొనాలని, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. మూడు రోజుల అసెంబ్లీ పరిణామాలతో బీఆర్ఎస్‌కు రాజకీయంగా నష్టం జరిగిందని పేర్కొంటూనే.. 22ఏ అంశంలో విపక్షాల దాడికి సభలోనే గట్టి సమాధానం ఇవ్వాలన్న సంకేతాలను పార్టీ శ్రేణులకు ఇచ్చినట్లు తెలిసింది.