‘‘ఫ్యూచర్ సిటీకి కాదు కేటీఆర్.. బీఆర్ఎస్ పార్టీకే ఫ్యూచర్ లేదు’’ అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టవద్దని పారిశ్రామికవేత్తలను హెచ్చరించడం కేటీఆర్ దిగజారుడుతనానికి, ప్రజా వ్యతిరేక వైఖరికి నిదర్శనమని ఎక్స్ వేదికగా విమర్శించారు.
హరీశ్‌రావుపైనా పొంగులేటి తీవ్ర ఆరోపణలు చేశారు. వైద్యశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆసుపత్రులతో వ్యాపారం చేసి కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపిస్తూ.. ఆయనను పక్కన పెట్టుకుని అధికార దుర్వినియోగం గురించి కేటీఆర్ మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు.
సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో చేపడుతున్న ఫ్యూచర్ సిటీని అడ్డుకునేందుకు ఎన్ని అవరోధాలు సృష్టించినా ప్రభుత్వ సంకల్పం ముందు నిలబడవని పేర్కొన్నారు. దేశం గర్వించేలా, తెలంగాణ ప్రజలు తలెత్తుకునేలా, భవిష్యత్ తరాలకు భరోసా ఇచ్చేలా ఫ్యూచర్ సిటీని నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు.
‘‘ఫ్యూచర్ సిటీని నిర్మిస్తాం.. బీఆర్ఎస్‌ను రాజకీయంగా బొంద పెడతాం’’ అంటూ పొంగులేటి తన పోస్టులో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.