బంగారం తాకట్టు పెట్టకుండానే.. పెట్టినట్లు నకిలీ పత్రం సృష్టించి ఓ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీకి రూ.59.30 లక్షల టోకరా వేశారు. ఈ కేసులో శ్రిమాన్ కో-ఆపరేటివ్ క్రెడిట్ యూనియన్ చైర్మన్, సీఈఓ ఎలిమి సంతోష్ (37), వ్యాపారి వడ్డేపల్లి రంజిత్ (39)ను హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఇన్‌స్పెక్టర్ మచ్చ శివకుమార్ తెలిపారు.
పోలీసుల విచారణ ప్రకారం.. నిందితులు ఇద్దరూ కలిసి కుట్ర పన్ని రంజిత్‌కు చెందిన సుమారు 640 గ్రాముల బంగారం శ్రిమాన్ కో-ఆపరేటివ్ క్రెడిట్ యూనియన్‌లో తాకట్టు ఉన్నట్లు నకిలీ ప్లెడ్జ్ రసీదు సృష్టించారు. దానిని నిజమైన పత్రంగా గోల్డ్ ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధిని నమ్మించారు. బంగారాన్ని ప్రత్యక్షంగా పరిశీలించకుండానే ఆ సంస్థ ప్రతినిధి రూ.59.30 లక్షలను ఆర్టీజీఎస్ ద్వారా క్రెడిట్ యూనియన్ ఖాతాకు బదిలీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
మోసం బయటపడటంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తామని గోల్డ్ ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులు హెచ్చరించగా.. అప్పటికే ఖాతాలోని డబ్బును ఇతర అవసరాలకు మళ్లించినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. నిందితుల మొబైల్ ఫోన్లు, నకిలీ ప్లెడ్జ్ రసీదు కాపీని స్వాధీనం చేసుకున్నారు.
ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా? ఇదే తరహాలో ఇతర గోల్డ్ ఫైనాన్స్ సంస్థలను కూడా మోసం చేశారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాకట్టు పత్రాల ఆధారంగా రుణాలు ఇచ్చే ముందు బంగారం వాస్తవంగా ఉందో లేదో ప్రత్యక్షంగా ధ్రువీకరించుకోవాలని ఇన్‌స్పెక్టర్ మచ్చ శివకుమార్ సూచించారు.