జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మేకలను తరలిస్తున్న డీసీఎం విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వాహనంలో చిక్కుకున్న డ్రైవర్ బయటకు రాలేక సజీవదహనమయ్యాడు. డీసీఎంలో తరలిస్తున్న సుమారు 200 మేకలు కూడా మంటల్లో కాలిపోయాయి. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ సమీపంలోని జాతీయ రహదారి–44పై గురువారం తెల్లవారుజామున ఈ విషాదం జరిగింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో డీసీఎం అదుపుతప్పి రహదారి పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రతకు వాహనంలో మంటలు వ్యాపించాయి. కొద్దిసేపటికే డీసీఎం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. డ్రైవర్‌కు బయటపడే అవకాశం లేకపోవడంతో వాహనంలోనే మృతి చెందాడు. మేకలు కూడా బయటకు వచ్చే అవకాశం లేక పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంతో NH-44పై కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
డీసీఎం అదుపుతప్పడానికి కారణమేంటి?.. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా?.. అతివేగం ప్రమాదానికి దారితీసిందా?.. అనే అంశాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఒకే ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు భారీ సంఖ్యలో మూగజీవాలు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.