రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు–మిల్లింగ్ వ్యవస్థలో కీలక భాగస్వాములైన ప్రభుత్వం, రైస్ మిల్లర్ల మధ్య పేరుకుపోయిన సమస్యలకు పరిష్కారం ఎప్పుడు? పెరిగిన నిర్వహణ వ్యయం, ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులు, సీఎంఆర్ నిబంధనలు, పెనాల్టీలు, విద్యుత్ ఛార్జీలు, బ్యాంకు రుణాలతో పరిశ్రమ ఇబ్బందుల్లో ఉందని తెలంగాణ రాష్ట్ర రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. మరోవైపు రైతుల నుంచి ప్రజాధనంతో కొనుగోలు చేసి మిల్లులకు అప్పగించే ధాన్యానికి ప్రతి గింజకూ లెక్క ఉండాలని, సీఎంఆర్‌ను నిర్ణీత గడువులో అప్పగించాల్సిందేనన్నది ప్రభుత్వ యంత్రాంగం వాదన. ఇరువర్గాల వాదనల్లోనూ విస్మరించలేని అంశాలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం మిల్లర్లను చర్చలకు పిలిచి సమస్యలవారీగా పరిష్కారం చూపాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఖర్చులు పెరిగాయి.. ఛార్జీ పెంచండి
విద్యుత్, కార్మిక వేతనాలు, రవాణా, యంత్రాల నిర్వహణ వ్యయం భారీగా పెరిగినా మిల్లింగ్ ఛార్జీలు అందుకు అనుగుణంగా పెరగలేదని మిల్లర్లు చెబుతున్నారు. క్వింటాల్‌కు మిల్లింగ్ ఛార్జీ రూ.150కు పెంచాలని, పాత గన్ని బ్యాగ్ ధరను రూ.11గా నిర్ణయించాలని కోరుతున్నారు. 2014 నుంచి రావాల్సిన మిల్లింగ్, ట్రాన్స్‌పోర్ట్, డ్రయేజ్ తదితర బకాయిలను వెంటనే విడుదల చేయాలంటున్నారు. 25 శాతం పెనాల్టీ, 12 శాతం వడ్డీని మాఫీ చేయాలన్నది మరో ప్రధాన డిమాండ్.
‘ప్రభుత్వ ధాన్యానికి లెక్క తప్పనిసరి’
మిల్లర్ల ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు ఉంటే.. ప్రభుత్వ బాధ్యత మరోవైపు ఉంది. రైతుల నుంచి భారీగా ప్రజాధనం వెచ్చించి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు అప్పగిస్తున్నందున నిల్వలు, నాణ్యత, సీఎంఆర్ డెలివరీ విషయంలో కచ్చితత్వం తప్పనిసరి. నిర్ణీత సమయంలో బియ్యం తిరిగి ఇవ్వకపోయినా, నిల్వల్లో తేడాలు కనిపించినా తనిఖీలు చేయాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉంటుంది. నిబంధనల పేరుతో నిజాయతీగా పనిచేసే మిల్లర్లను ఇబ్బంది పెట్టొద్దని మిల్లర్లు కోరుతుండగా.. ప్రభుత్వ ధాన్యం విషయంలో పర్యవేక్షణను సడలించలేమన్నది అధికార వర్గాల వాదన.
కరెంట్ నుంచి ఎఫ్‌సీఐ వరకు..
రైస్ మిల్లులను వ్యవసాయ అనుబంధ పరిశ్రమలుగా గుర్తించి 200 హెచ్‌పీ వరకు విద్యుత్‌ను ఎల్‌టీ కేటగిరీ కింద అందించాలని మిల్లర్లు కోరుతున్నారు. నాణ్యత ప్రమాణాలకు అనుగుణమైన ఎఫ్‌ఏక్యూ ధాన్యాన్నే ఇవ్వాలని, లేనిపక్షంలో నాణ్యత ఆధారంగా బియ్యం రేషియో నిర్ణయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఖరీఫ్ ధాన్యాన్ని రా రైస్‌గా, రబీ ధాన్యాన్ని బాయిల్డ్ రైస్‌గా మార్చుకునే వెసులుబాటుతో పాటు ఎఫ్‌సీఐ నిబంధనల్లో ఎదురవుతున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడాలని కోరుతున్నారు. బ్యాంకు రుణాల విషయంలోనూ ఇబ్బందుల్లో ఉన్న మిల్లులకు తగిన వెసులుబాటు కల్పించాలంటున్నారు.
చర్చలతోనే చిక్కుముడికి పరిష్కారం
మిల్లర్ల డిమాండ్లన్నింటినీ యథాతథంగా అంగీకరించడం ప్రభుత్వానికి సాధ్యం కాకపోవచ్చు. అదే సమయంలో పరిశ్రమ ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలను విస్మరించడం కూడా ధాన్యం కొనుగోలు వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే పౌరసరఫరాలు, ఆర్థిక, విద్యుత్ శాఖల అధికారులు, మిల్లర్ల ప్రతినిధులతో ప్రభుత్వం ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఒక్కో డిమాండ్‌పై సాధ్యాసాధ్యాలను తేల్చాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రభుత్వానికి రావాల్సిన సీఎంఆర్‌పై స్పష్టమైన కార్యాచరణ, మిల్లర్లకు రావాల్సిన బకాయిలకు చెల్లింపు గడువు, తనిఖీలకు పారదర్శక విధానం, ఆచరణ సాధ్యమైన నిబంధనలు రూపొందిస్తే ఇరువర్గాల మధ్య ప్రతిష్టంభనకు తెరపడే అవకాశం ఉంటుంది.
ప్రభుత్వ ధాన్యానికి జవాబుదారీతనం ఎంత ముఖ్యమో.. మిల్లింగ్ పరిశ్రమ మనుగడ కూడా అంతే ముఖ్యం. ఈ రెండింటి మధ్య రైతు నష్టపోకుండా చూడటమే అసలు లక్ష్యం కావాలి. మిల్లర్ల గోడును సర్కారు వినాలి.. ప్రభుత్వ బాధ్యతను మిల్లర్లు గుర్తించాలి. చర్చల బల్లపైనే ఈ చిక్కుముడికి పరిష్కారం వెతకాలి.