హైదరాబాద్, సెప్టెంబర్ 9 (మన విశ్వం): తెలంగాణలో విద్యుత్ డిమాండ్ కొత్త శిఖరాన్ని తాకింది. బుధవారం ఉదయం 10:41 గంటలకు రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ఆల్‌టైమ్ గరిష్ఠంగా 19,543 మెగావాట్లకు చేరింది. రికార్డు స్థాయిలో పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ను విజయవంతంగా సరఫరా చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. గతేడాది ఇదే రోజుతో పోలిస్తే డిమాండ్ ఏకంగా 23 శాతం పెరగడం గమనార్హం.
2025 సెప్టెంబర్ 9న గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 15,906 మెగావాట్లు కాగా.. ఏడాది తిరిగేసరికి 19,543 మెగావాట్లకు చేరింది. గృహ, వ్యవసాయ, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో పెరుగుతున్న వినియోగంతో రాష్ట్ర విద్యుత్ అవసరాలు వేగంగా పెరుగుతున్నాయి.
ఆరు నెలల్లోనే రికార్డు బ్రేక్
ఈ ఏడాది మార్చి 27న నమోదైన 19,506 మెగావాట్లే ఇప్పటివరకు అత్యధిక డిమాండ్. కేవలం ఆరు నెలల్లోనే ఆ రికార్డును అధిగమించింది. 2022–23లో 15,497 మెగావాట్లు, 2023–24లో 15,623 మెగావాట్లు, 2024–25లో 17,162 మెగావాట్లుగా ఉన్న గరిష్ఠ డిమాండ్ ఇప్పుడు 19,543 మెగావాట్లకు చేరింది.
రికార్డు డిమాండ్ నేపథ్యంలో డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం సీఎస్ సంజయ్ జాజు నేతృత్వంలో ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంలు, సింగరేణి ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
నేడు కీలక సమీక్ష
పెరుగుతున్న డిమాండ్‌ను ఎదుర్కొనేందుకు తక్షణ చర్యలు, భవిష్యత్ విద్యుత్ అవసరాలకు అవసరమైన మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలపై సెప్టెంబర్ 10న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఉన్నతస్థాయి సమీక్ష జరగనుంది. ఏడాదిలోనే 23 శాతం పెరిగిన డిమాండ్ నేపథ్యంలో నిరంతరాయ సరఫరా కోసం ప్రభుత్వం తీసుకునే తదుపరి చర్యలు కీలకంగా మారనున్నాయి.