🏠 www.manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 07 September 2026, 11:59 PM Posted by: MANA VISHWAM

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలకు త్రీలైన్‌ విప్‌

తెలంగాణ శాసనమండలి సమావేశాల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీకి చెందిన ఎమ్మెల్సీలందరికీ త్రీలైన్‌ విప్‌ జారీ చేసింది. సెప్టెంబర్‌ 8న జరిగే శాసనమండలి సమావేశానికి సభ్యులంతా తప్పనిసరిగా హాజరై, సభ వాయిదా పడే వరకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది.
బీఆర్‌ఎస్‌ శాసనమండలి విప్‌ దేశపతి శ్రీనివాస్‌ సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే మండలి సమావేశానికి ఎమ్మెల్సీలందరూ హాజరుకావాలని పేర్కొన్నారు. సభలో జరిగే చర్చల్లో పార్టీ అధికారిక విధానం, వైఖరికి అనుగుణంగానే వ్యవహరించాలని ఆదేశించారు.
మండలిలో ఏదైనా బిల్లు, తీర్మానం లేదా ఇతర అంశంపై ఓటింగ్‌ జరిగితే బీఆర్‌ఎస్‌ అధికారిక నిర్ణయానికి అనుగుణంగానే ఓటు వేయాలని విప్‌లో స్పష్టం చేశారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనగా పరిగణిస్తామని, పదో షెడ్యూల్‌ (ఫిరాయింపుల నిరోధక చట్టం), మండలి నిబంధనల ప్రకారం అనర్హత ప్రక్రియకు దారితీయవచ్చని హెచ్చరించారు.
శాసనమండలి సమావేశానికి ముందు బీఆర్‌ఎస్‌ త్రీలైన్‌ విప్‌ జారీ చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది
🏠 Home