🏠 www.manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 07 September 2026, 01:30 PM Posted by: MANA VISHWAM

తాతా మధు సభ్యత్వం రద్దు చేయాలి!

శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. దళితుడైన స్పీకర్‌ను అభ్యంతరకర పదజాలంతో దూషించడమేంటని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘అమ్మకు, ఆడబిడ్డకు, దళితులకు మీ పార్టీ ఇచ్చే గౌరవం ఇదేనా కేసీఆర్‌ గారూ?’’ అని ప్రశ్నించారు. స్పీకర్‌ను అవమానించడం రాజ్యాంగ వ్యవస్థను, శాసనసభ గౌరవాన్ని అవమానించడమేనని మంత్రి పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు. తాతా మధును వెంటనే సస్పెండ్‌ చేసి, ఎమ్మెల్సీ సభ్యత్వం రద్దుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తన పార్టీ ఎమ్మెల్సీ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు.
🏠 Home