హైదరాబాద్, సెప్టెంబర్ 7 (మన విశ్వం): అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మహిళా ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్న తీరుపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ చీరలు లాగి, గొంతులు పట్టుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పోలీసులకు ఆదేశాలు ఇచ్చారా? అంటూ ప్రశ్నించారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత అవమానకరమని ఆరోపించారు. ఈ ఘటనకు ముఖ్యమంత్రి బాధ్యత వహించి మహిళా సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి వెళ్లేందుకు ప్రయత్నించిన తమను పోలీసులు అడ్డుకున్నారని సబిత ఆరోపించారు. ‘‘రాహుల్‌గాంధీ నల్ల టీషర్టు ధరించి, దానిపై మోదీ–అదానీ ఫొటో పెట్టుకొని పార్లమెంట్ వద్ద ప్రశ్నించవచ్చు. కానీ తెలంగాణలో మేం నల్ల దుస్తులు వేసుకొని అసెంబ్లీకి వెళ్లకూడదా?’’ అని నిలదీశారు. తాము వ్యక్తిగత ప్రయోజనాల కోసం అసెంబ్లీకి వెళ్లడం లేదని, ప్రజల సమస్యలు, ప్రభుత్వ హామీలపై ప్రశ్నించేందుకే వెళ్తున్నామని చెప్పారు. అయినప్పటికీ సభలోకి వెళ్లకుండా పోలీసులతో అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు.
‘‘ప్రశ్నిస్తే చీరలు లాగుతారా?.. జుట్టు పట్టుకొని ఈడుస్తారా?.. గొంతు నొక్కుతారా?’’ అంటూ సబిత తీవ్రంగా స్పందించారు. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీరను పోలీసులు లాగారని, ఆ సమయంలో కేటీఆర్ జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. ఆయన సమయానికి రాకపోయి ఉంటే తమను అక్కడే పడేసి తొక్కేవారేమోనని ఆరోపించారు. ఇది సునీతా లక్ష్మారెడ్డికో, తనకో జరిగిన అవమానం కాదని.. మొత్తం మహిళా సమాజానికి జరిగిన అవమానమని వ్యాఖ్యానించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాసనసభ చరిత్రలో మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు ఇలా వ్యవహరించిన సందర్భం లేదని సబిత పేర్కొన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లోనూ సీఎం తమపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నాలుగు రోజులపాటు సభలో నిలబడినా స్పీకర్ కనీసం కూర్చోవాలని చెప్పలేదని గుర్తుచేశారు. ఇప్పుడు ఏకంగా సభలోకి వెళ్లకుండా అడ్డుకోవడం ప్రజాప్రతినిధుల హక్కులను కాలరాయడమేనని విమర్శించారు.
ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కూడా పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘అసెంబ్లీ సాక్షిగా మాకు జరిగిన అవమానాన్ని దుశ్శాసన పర్వంగా భావిస్తున్నాం. తెలంగాణ శాసనసభ చరిత్రలో ఇది బ్లాక్ డే’’ అని వ్యాఖ్యానించారు. తాము చేసిన తప్పేమిటని ప్రశ్నించారు. ‘‘మహిళలమని కూడా చూడకుండా ఇష్టమొచ్చినట్లు లాగేశారు. ప్రజల పక్షాన మాట్లాడటమే మేం చేసిన పాపమా?’’ అని నిలదీశారు.
పోలీసులు లాగడంతో తాము అక్కడున్న గ్రిల్స్‌పై పడిపోయే పరిస్థితి ఏర్పడిందని, ఎమ్మెల్యే కోవ లక్ష్మి వచ్చి కాపాడారని సునీత పేర్కొన్నారు. మహిళా ప్రజాప్రతినిధులకే అసెంబ్లీ ప్రాంగణంలో ఈ పరిస్థితి ఎదురైతే సాధారణ మహిళలకు ప్రభుత్వం ఇచ్చే భరోసా ఏమిటని బీఆర్‌ఎస్ నేతలు ప్రశ్నించారు. ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించి మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.