‘‘కేసీఆర్ గారూ.. అసెంబ్లీ సమావేశాలు కూడా ఫాంహౌస్‌లోనే నిర్వహించమంటారా?’’ అంటూ మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కేసీఆర్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించడాన్ని తప్పుబడుతూ ఆదివారం ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.
‘‘ఫాంహౌస్‌లో శాసనసభాపక్ష సమావేశమా?.. ఇదేం పద్ధతి కేసీఆర్ గారు!’’ అని పొంగులేటి ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ నాయకులు దొర పోకడలతో వ్యవహరిస్తున్న తీరు రాచరిక రోజులను తలపిస్తోందని విమర్శించారు.
ప్రతిపక్ష నాయకుడి హోదాలో గత వెయ్యి రోజుల్లో రూ.కోటికి పైగా ప్రజాధనాన్ని జీతంగా తీసుకున్నారని, భద్రతతోపాటు ఇతర సౌకర్యాల కోసం ప్రభుత్వం రూ.21 కోట్లకు పైగా ఖర్చు చేసినప్పటికీ కేసీఆర్ శాసనసభకు హాజరుకాకుండా ఫాంహౌస్‌కే పరిమితమయ్యారని పొంగులేటి ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాలరాయడమేనని పేర్కొన్నారు.
ఇప్పుడు ఎర్రవెల్లి ఫాంహౌస్‌లోనే శాసనసభాపక్ష సమావేశం నిర్వహించడం నియంత పోకడలకు నిదర్శనమని ధ్వజమెత్తారు. ఇదే ధోరణి కొనసాగితే రానున్న రోజుల్లో అసెంబ్లీ సమావేశాలను కూడా ఫాంహౌస్‌లోనే నిర్వహించాలని కేసీఆర్ డిమాండ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పొంగులేటి ఎద్దేవా చేశారు.