కొమురం భీం , సెప్టెంబర్ 5 (మన విశ్వం): సిర్పూర్–టి నియోజకవర్గంలో రాజకీయ సమరం మరింత వేడెక్కింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ తనపై చేసిన విమర్శలకు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అదే స్థాయిలో ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ‘‘నా నాలుక కోస్తానంటావా..? ఖబర్దార్ బిడ్డా.. నా వెంట్రుక కూడా పీకలేవు. నేను ఇంటికాడనే ఉంటా.. రా.. ఎవరి సత్తా ఏంటో తేల్చుకుందాం’’ అంటూ బహిరంగ సవాల్ విసిరారు. శనివారం కాగజ్‌నగర్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోనప్ప తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
‘‘దండే విఠల్.. నువ్వు చెంచాగిరి చేసి ఎమ్మెల్సీ పదవి పొందావు. ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉండి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నన్ను విమర్శించే ముందు నీ స్థాయి ఏమిటో తెలుసుకో. నువ్వు ఏ పార్టీ నుంచి గెలిచావు? నీ రాజకీయ నేపథ్యం ఏమిటి? ఎవరి సత్తా ఎంత? అన్నీ ప్రజలకు తెలుసు’’ అని కోనప్ప వ్యాఖ్యానించారు.
కాళేశ్వరం తరలిపోతుంటే ఏం చేశావ్?
ప్రాజెక్టుల అంశంపైనా విఠల్‌ను కోనప్ప నిలదీశారు. ‘‘2024 వరకు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎందుకు మాట్లాడలేదు? ప్రాజెక్టు తరలిపోతుంటే ఎందుకు అడ్డుకోలేదు? కనీసం ఒక వినతిపత్రం అయినా ఎందుకు ఇవ్వలేదు?’’ అని ప్రశ్నించారు. ఇప్పుడు తనపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
17 వేలు వర్సెస్ 63 వేలు
ఎన్నికల్లో వచ్చిన ఓట్ల లెక్కలనూ కోనప్ప ప్రస్తావించారు. ‘‘నువ్వు బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు నీకు ఎన్ని ఓట్లు వచ్చాయో.. నేను కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు నాకు ఎన్ని ఓట్లు వచ్చాయో ప్రజలకు తెలుసు. నీకు కేవలం 17 వేల ఓట్లు వస్తే.. పార్లమెంట్ ఎన్నికల్లో నేను 63 వేల ఓట్లు సాధించాను. ఎవరి ప్రజాబలం ఎంతో ఈ లెక్కలే చెబుతాయి’’ అని పేర్కొన్నారు.
గన్‌మెన్లు లేకున్నా భయపడను
విఠల్ చేసిన వ్యాఖ్యలపై కోనప్ప మరింత తీవ్రంగా స్పందించారు. ‘‘నా నాలుక కోస్తానని అంటున్నావు. ఖబర్దార్ బిడ్డా.. నా వెంట్రుక కూడా పీకలేవు. నేను ఇంటికాడనే ఉంటా.. రా.. ఎవరి సత్తా ఏంటో తేల్చుకుందాం. నాకు ఇప్పుడు గన్‌మెన్లు కూడా లేరు. నీకు గన్‌మెన్లు ఉన్నారు. అయినా నేను భయపడే ప్రసక్తే లేదు’’ అని సవాల్ విసిరారు.
ప్రజల ఆశీర్వాదంతోనే తాను రాజకీయాల్లో ఉన్నానని, వారి కోసమే పనిచేస్తున్నానని కోనప్ప పేర్కొన్నారు. ‘‘నీ స్థాయికి మించి మాట్లాడటం మానుకో’’ అంటూ విఠల్‌ను హెచ్చరించారు. ఒకరోజు ముందు కోనప్పపై ఎమ్మెల్సీ దండే విఠల్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు.. తాజాగా కోనప్ప ఇచ్చిన ఘాటు కౌంటర్‌తో సిర్పూర్ రాజకీయాలు'సవాల్-ప్రతి సవాల్' గా మారాయి.