కరీంనగర్, సెప్టెంబర్ 5 (మన విశ్వం): సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కరీంనగర్‌లో నిర్వహించిన ‘యువ సమరభేరి’లో ప్రసంగించిన ఆయన.. ‘అతడు’ సినిమాలో బ్రహ్మానందం–మహేష్‌బాబు మధ్య వచ్చే కామెడీ సన్నివేశాన్ని ప్రస్తావిస్తూ రేవంత్‌రెడ్డిపై సెటైర్లు పేల్చారు.
‘‘అతడు సినిమాలో బ్రహ్మానందం నాలుగు రోజులు ఎక్సర్‌సైజ్ చేసి బలం వచ్చిందని మహేష్‌బాబును ‘హిట్ మీ యార్.. హిట్ మీ’ అంటాడు. మహేష్‌బాబు గట్టిగా గుద్దగానే కిందికెళ్లి పేస్ట్ కారుతుంది. కేసీఆర్‌తో పెట్టుకుంటే రేవంత్‌రెడ్డి గతి కూడా అదే అవుతుంది’’ అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.
‘మూడు తరాలను ముంచిన ముసలి నక్క’
కాంగ్రెస్‌ను ‘ముసలి నక్క’గా అభివర్ణించిన కేటీఆర్.. మూడు తరాలుగా తెలంగాణను ఆ పార్టీ ముంచిందని ఆరోపించారు. 1956లో తెలంగాణ–ఆంధ్రకు ఇష్టం లేకున్నా బలవంతపు కలయిక చేసిందని, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో వందల మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. 1971లో తెలంగాణ ప్రజలు గెలిపించిన ఎంపీలను కాంగ్రెస్‌లో కలుపుకుందని ఆరోపించారు. 2004లో తెలంగాణ ఇస్తామని మాటిచ్చి పదేళ్లపాటు సతాయించిందని విమర్శించారు. శ్రీకాంతాచారి వంటి యువకుల బలిదానాలు, కేసీఆర్ నిరాహార దీక్ష తర్వాతే తెలంగాణ వచ్చిందన్నారు.
‘100 రోజులన్నారు.. 1000 రోజులైంది’
యూత్ డిక్లరేషన్‌లో 24 హామీలు ఇచ్చి ఒక్కటీ అమలు చేయలేదని కేటీఆర్ మండిపడ్డారు. ‘‘100 రోజుల్లో అమలు చేస్తామన్నారు.. 1000 రోజులైంది. బకాసురుల్లా తింటున్నారు.. కుంభకర్ణుల్లా పడుకుంటున్నారు.. పందికొక్కుల్లా తింటున్నారు. అది తప్ప కాంగ్రెస్ వాళ్లు చేసిందేమీ లేదు’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ రాజీనామా చేయాలన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపైనా కేటీఆర్ మండిపడ్డారు. ‘‘తెలంగాణ తెచ్చిన కేసీఆర్ రాజీనామా చేయాలా? లేక ఇచ్చిన హామీలు అమలు చేయని రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలా?’’ అని ప్రశ్నించారు.
‘నిరుద్యోగులే పిండం పెడతారు’
ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న కాంగ్రెస్ హామీని నమ్మి నిరుద్యోగ యువత ఓట్లు వేసిందని కేటీఆర్ అన్నారు. ‘‘ఎన్నికలప్పుడు దండాలు పెట్టి ఓట్లు వేయించుకున్నారు. రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని నమ్మిన నిరుద్యోగులే రేపు కాంగ్రెస్‌కు పిండం పెడతారు’’ అంటూ హెచ్చరించారు.