ఆదిలాబాద్ జిల్లా (మన విశ్వం): కాలు జారినా.. బస్సు ఒక్కసారిగా బ్రేక్ వేసినా.. ఏమాత్రం అదుపుతప్పినా అంతే! గమ్యం చేరాలనే తొందరలో కొందరు ప్రయాణికులు ప్రాణాలను పణంగా పెట్టి ఫుట్‌బోర్డుపై వేలాడుతూ ప్రయాణిస్తున్నారు. బస్సులో సీట్లు లేకపోయినా, నిలబడేందుకు చోటు దొరకకపోయినా మరో బస్సు కోసం వేచి చూడకుండా ప్రమాదకర ప్రయాణానికే మొగ్గుచూపుతున్నారు.
రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమల్లోకి వచ్చిన తర్వాత పలు మార్గాల్లో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగింది. ముఖ్యంగా రద్దీ సమయాల్లో కొన్ని బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో కొందరు ఫుట్‌బోర్డునే ఆసరాగా చేసుకుని ప్రయాణిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
ఫుట్‌బోర్డు ప్రయాణం ప్రమాదకరమని కండక్టర్లు హెచ్చరిస్తున్నా కొందరు ప్రయాణికులు పట్టించుకోవడం లేదని సిబ్బంది చెబుతున్నారు. బస్సు మలుపు తిరిగినప్పుడు లేదా అకస్మాత్తుగా బ్రేక్ వేసినప్పుడు అదుపుతప్పి కిందపడితే ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశం ఉంది.
ప్రమాద రహిత ప్రయాణంపై ఆర్టీసీ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ప్రయాణికుల్లోనూ బాధ్యత అవసరమని సిబ్బంది సూచిస్తున్నారు. మరోవైపు రద్దీ ఎక్కువగా ఉండే మార్గాలను గుర్తించి అదనపు బస్సులు నడపడంతో పాటు ఫుట్‌బోర్డు ప్రయాణాలకు అడ్డుకట్ట వేసే చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.