కొమరం భీం, సెప్టెంబర్ 5 (మన విశ్వం): సిర్పూర్ రాజకీయాల్లో సవాళ్ల పర్వం మొదలైంది. రాబోయే ఎన్నికల్లో తన గెలుపును ఎవరూ అడ్డుకోలేరని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ ధీమా వ్యక్తం చేశారు. ‘‘దమ్ముంటే నా గెలుపును అడ్డుకోండి’’ అంటూ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు బహిరంగ సవాల్ విసిరారు.
కాగజ్‌నగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో విఠల్ ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. 22-ఏ భూములు, ధరణి సమస్యలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనే కారణమని ఆరోపించారు.
తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలోనూ కోనప్పను నిలదీశారు. ప్రాజెక్టును కాళేశ్వరం వైపు మళ్లించే సమయంలో అప్పటి ప్రజాప్రతినిధిగా ఉన్న కోనప్ప ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. ఇప్పుడు విమర్శలు చేయడం ఏమిటని మండిపడ్డారు.
‘‘కోనప్ప వయసుకు గౌరవం ఇచ్చాం. దాన్ని బలహీనతగా భావించొద్దు. హద్దులు దాటి మాట్లాడితే తీవ్రంగా స్పందించాల్సి వస్తుంది’’ అని విఠల్ హెచ్చరించారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ‘నా గెలుపును ఆపండి’ అంటూ విఠల్ విసిరిన సవాల్‌తో సిర్పూర్ నియోజకవర్గ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.