నల్లబెల్లి, సెప్టెంబర్ 5 (మన విశ్వం): విద్యుదాఘాతంతో మృతి చెందిన 14 ఏళ్ల పిట్టల సిరివెన్నెల మరణానంతరం మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపనుంది. తీవ్ర విషాదంలోనూ ఆమె కుటుంబ సభ్యులు నేత్రదానానికి ముందుకొచ్చి ఆదర్శంగా నిలిచారు. సిరివెన్నెల నేత్రాలను ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన రామాయమ్మ ఇంటర్నేషనల్ ఐ బ్యాంక్‌కు దానం చేశారు. ఈ మేరకు ఐ బ్యాంక్ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతా పత్రాన్ని అందజేసింది. చిన్న వయసులోనే సిరివెన్నెలను కోల్పోయిన కుటుంబం.. ఆమె కళ్ల ద్వారా మరొకరి జీవితంలో వెలుగు నింపాలనే నిర్ణయం తీసుకోవడం పలువురిని కదిలించింది.