వరంగల్ కాంగ్రెస్‌లో ఒకేరోజు కీలక పరిణామాలు
సురేఖను కేబినెట్ నుంచి తప్పించాలని సీఎం నిర్ణయం
గవర్నర్‌కు సిఫార్సు.. కొండా రాజకీయ భవిష్యత్తుపై ఉత్కంఠ
కుడా చైర్‌పర్సన్‌గా మాజీ ఎంపీ గుండు సుధారాణి
హైదరాబాద్, (మన విశ్వం): ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మంత్రి కొండా సురేఖను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తప్పించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించడం రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ మేరకు గవర్నర్‌కు సిఫార్సు పంపినట్లు వెల్లడైంది. కొద్దిరోజులుగా సురేఖ వ్యవహారంపై ఢిల్లీ స్థాయిలో సాగిన మంతనాల అనంతరం ఈ నిర్ణయం వెలువడింది.
ఇదే సమయంలో వరంగల్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) చైర్‌పర్సన్‌గా మాజీ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి నియామకానికి సీఎం ఆమోదం తెలిపారు. వరంగల్ నగరాభివృద్ధిలో కీలకమైన సంస్థ పగ్గాలు ఆమెకు అప్పగించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఒకవైపు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ మంత్రి పదవి నుంచి తప్పనున్న పరిస్థితి.. మరోవైపు గుండు సుధారాణికి కుడా పగ్గాలు దక్కడంతో ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్‌లో రాజకీయ సమీకరణాలు మారనున్నాయన్న చర్చ మొదలైంది. ఇప్పుడు కొండా సురేఖ తదుపరి అడుగు ఏమిటన్నదే రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.