🏠 www.manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 31 August 2026, 11:53 PM Posted by: MANA VISHWAM

వరంగల్ కమిషనరేట్‌లో భారీ బదిలీలు

వరంగల్ క్రైం , ఆగస్టు 31 (మన విశ్వం): వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా ఇన్‌స్పెక్టర్ల బదిలీలు జరిగాయి. కమిషనరేట్‌లో వివిధ విభాగాలు, పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న 22 మంది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
పరిపాలనా సౌలభ్యం, పోలీసింగ్‌ను మరింత సమర్థంగా నిర్వహించేందుకు ఈ బదిలీలు చేపట్టినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. బదిలీ అయిన ఇన్‌స్పెక్టర్లు వారికి కేటాయించిన స్థానాల్లో విధుల్లో చేరాల్సిందిగా ఆదేశించినట్లు సమాచారం.
ఒకేసారి 22 మంది ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం కల్పించడం కమిషనరేట్ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.
🏠 Home