ప్రసాద్ పథకం పనులను పరిశీలించిన మంత్రి సీతక్క
గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు
వారసత్వ కట్టడం ప్రాచీనతకు భంగం కలగొద్దని స్పష్టం
ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన పాలంపేట రామప్ప దేవాలయం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ (PRASAD) పథకం కింద చేపడుతున్న రూ.61.99 కోట్ల పనులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావుతో కలిసి పనుల పురోగతిని సమీక్షించిన మంత్రి, నిర్దేశిత గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆలయ పరిసరాల్లో జరుగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి, భక్తులకు కల్పిస్తున్న వసతులు, పర్యాటకులకు అందిస్తున్న సౌకర్యాలను మంత్రి పరిశీలించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ఎలాంటి నిర్లక్ష్యానికీ తావులేకుండా పనులను వేగవంతం చేయాలని సూచించారు.
రామప్ప ఆలయం అంతర్జాతీయ ఖ్యాతి పొందిన వారసత్వ సంపద కావడంతో అభివృద్ధి పనులు ఆలయ ప్రాచీనతకు ఏమాత్రం భంగం కలగకుండా చేపట్టాలని మంత్రి స్పష్టం చేశారు. వారసత్వ విలువలను పరిరక్షిస్తూనే భక్తులు, దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు అత్యుత్తమ సౌకర్యాలు అందించేలా ప్రణాళికలు అమలు చేయాలని అధికారులకు సూచించారు.
జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ ప్రసాద్ పథకం కింద చేపడుతున్న ప్రతి పనిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. నిర్ణయించిన గడువులోగా అన్ని పనులు పూర్తయ్యేలా సంబంధిత శాఖల మధ్య సమన్వయంతో చర్యలు చేపడుతున్నామని చెప్పారు. నాణ్యత విషయంలో రాజీ లేకుండా అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాలని సూచించారు.
రామప్ప ఆలయాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం రహదారులు, పర్యాటక సౌకర్యాలు, ఇతర మౌలిక వసతుల బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ తనిఖీలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి, పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ భగవాన్‌రెడ్డి, పర్యాటక శాఖ డీఈ నటరాజ్, ఏఈ విజయ్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.