సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాల వేడుకలు ఆదివారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం కేటీఆర్‌ను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శాలువాతో సత్కరించి, అమ్మవారి జ్ఞాపికను అందజేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బోనాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజలందరూ ఐక్యంగా జరుపుకొనే గొప్ప పండుగ ఇదని కొనియాడారు. "ఉమ్మడి రాష్ట్రంలో బోనాలకు తగిన గుర్తింపు లభించలేదు. స్వరాష్ట్రం సిద్ధించాక కేసీఆర్ నేతృత్వంలో బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించి ఘనంగా నిర్వహించాం. అమ్మవారి దయ వల్లే తెలంగాణ కల సాకారమైంది" అని గుర్తుచేశారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతాంగం పాడిపంటలతో వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.