🏠 www.manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 29 July 2026, 03:56 PM Posted by: MANA VISHWAM

గడువులోగా భూసేకరణ పూర్తి చేయాలి

జిల్లాలో ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల అమలులో ఎలాంటి జాప్యానికి తావులేకుండా నిర్దేశిత గడువులో భూసేకరణ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
బుధవారం జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జే. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం, కొనైమాకుల ఎత్తిపోతల పథకం, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, ఇన్నర్ రింగ్ రోడ్, జాతీయ రహదారి–163జీ, రైల్వే ప్రాజెక్టులు, విమానాశ్రయానికి సంబంధించిన భూసేకరణ పనుల పురోగతిని శాఖల వారీగా సమీక్షించారు.
ప్రాజెక్టుల వారీగా పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, భూ స్వాధీనం, పరిహారం చెల్లింపులు, అవార్డు ప్రక్రియ తదితర అంశాలపై అధికారులతో కలెక్టర్ సవివరంగా చర్చించారు. భూసేకరణలో ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించి, పనులు ఆలస్యం కాకుండా సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.
ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులు సకాలంలో పూర్తయ్యేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జి. సంధ్యారాణి, డీఆర్వో విజయలక్ష్మి, వరంగల్, నర్సంపేట ఆర్డీవోలు సుమ, ఉమారాణి, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ స్వామి, విద్యుత్ శాఖ ఎస్‌ఈ ఆనందం తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
🏠 Home