ప్రీపెయిడ్ వినియోగదారులను ఆకట్టుకునేలా ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా (వి) కొత్త ఎంటర్‌టైన్‌మెంట్ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఓటీటీ స్ట్రీమింగ్, లైవ్ టీవీ సేవలు, మొబైల్ డేటా ప్రయోజనాలను ఒకే రీఛార్జ్‌లో అందించేలా ఈ ప్లాన్‌ను రూపొందించింది.
రూ.200 ధరతో లభించే ఈ 'వి మూవీస్ & టీవీ' ప్లాన్‌కు 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఇందులో 30 జీబీ హైస్పీడ్ డేటాతో పాటు 20 ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, 200కుపైగా లైవ్ టీవీ ఛానెళ్లను వీక్షించే అవకాశం కల్పిస్తోంది. హాట్‌స్టార్, సోనీలివ్, జీ5, లయన్స్‌గేట్ ప్లే, షెమారూ మీ, మనోరమా మ్యాక్స్ వంటి ప్రముఖ ఓటీటీ సేవలు ఇందులో అందుబాటులో ఉంటాయి. అర్హత ఉన్న వినియోగదారులకు అపరిమిత 5జీ సేవలు కూడా లభిస్తాయి.
ఈ ప్లాన్‌ను గరిష్టంగా నాలుగు డివైజ్‌లలో వినియోగించుకోవచ్చు. ఒకేసారి రెండు స్క్రీన్‌లపై కంటెంట్‌ను స్ట్రీమ్ చేసే సౌకర్యాన్ని కూడా సంస్థ కల్పించింది.
వేర్వేరుగా డేటా, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ల కోసం రీఛార్జ్‌లు చేయాల్సిన అవసరం లేకుండా అన్ని సేవలను ఒకే ప్లాన్‌లో అందించడమే లక్ష్యంగా ఈ ప్యాక్‌ను తీసుకొచ్చినట్లు సంస్థ తెలిపింది. తరచూ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వీక్షించే వారికి ఈ ప్లాన్ ప్రయోజనకరంగా ఉండనుంది. అయితే ఇప్పటికే ప్రత్యేక డేటా ప్లాన్ లేదా పరిమిత ఓటీటీ సేవలను మాత్రమే వినియోగించే వారికి ఈ ప్లాన్ అవసరం తక్కువగా ఉండొచ్చని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ వినోదాన్ని కోరుకునే ప్రీపెయిడ్ వినియోగదారులకు ఈ ప్లాన్ ఆకర్షణీయమైన ఎంపికగా మారే అవకాశం ఉంది.