ప్రతి ఒక్కరికీ యూనిఫామ్... లోపాలుంటే సహించేది లేదు
ఆగస్టు 15 నాటికి పంపిణీ పూర్తికావాలి
వచ్చే విద్యాసంవత్సరం నుంచి జూన్ 2కే పాఠశాలలకు..
అధికారుల సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల విద్యార్థులకు అందజేసే యూనిఫాంల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. దుస్తుల పంపిణీ పూర్తయిన తర్వాత వాటి నాణ్యత, పరిమాణం (సైజు) తదితర వివరాలపై ప్రతి విద్యార్థి నుంచి నేరుగా 'వాట్సాప్' ద్వారా అభిప్రాయాలను (ఫీడ్‌బ్యాక్) సేకరించనున్నట్లు వెల్లడించారు. పిల్లలు ఇచ్చే సూచనలు, ఫిర్యాదుల ఆధారంగానే వచ్చే విద్యాసంవత్సరం నుంచి రంగుల ఎంపిక, పంపిణీ విధానంపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో యూనిఫాంల పంపిణీ పురోగతిపై సీఎం గురువారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
గడువు దాటితే చర్యలు
ఆగస్టు 15వ తేదీ నాటికి రాష్ట్రంలో అర్హులైన విద్యార్థులందరికీ యూనిఫాంలు అందితీరాలని సీఎం స్పష్టమైన గడువు విధించారు. ఈ ప్రక్రియలో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో కుట్టు పనులు వేగవంతమయ్యేలా సెర్ప్ సీఈఓ దివ్య నిరంతరం జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
వ్యవస్థ ప్రక్షాళన జరుగుతోంది
"గత ప్రభుత్వ హయాంలో పాఠశాల పిల్లలకు దుస్తుల పంపిణీలో అడ్డగోలుగా వ్యవహరించారు. నాసిరకం దుస్తులతో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. ప్రస్తుతం మేము ఆ వ్యవస్థ మొత్తాన్ని ప్రక్షాళన చేస్తున్నాం. పేద విద్యార్థుల బాగు కోసం పనిచేస్తున్నామనే భావన అధికారులు, సిబ్బందిలో ఉండాలి" అని సీఎం పేర్కొన్నారు. రాబోయే విద్యాసంవత్సరంలో పాఠశాలలు ప్రారంభమయ్యే జూన్ 2వ తేదీ నాటికే విద్యార్థుల చేతికి యూనిఫాంలు చేరేలా ఇప్పటి నుంచే పక్కా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్‌రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్, సీఎం ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్, ఓఎస్డీ వేముల శ్రీనివాసులు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.