లారీల్లేవు.. రవాణా లేదు.. అయినా రూ. 4.81 కోట్లు గప్‌చుప్!
నకిలీ కాగితాలతో ‘పౌర’ధనానికి పెద్ద గండి
ఉమ్మడి జిల్లా సమీక్షకు నేడు రానున్న ఇన్‌ఛార్జి మంత్రి
విజిలెన్స్ విచారణకు ఆదేశించేనా?
లారీ రోడ్డెక్కలేదు.. ధాన్యం బస్తా అసలే కదల్లేదు.. కానీ కాగితాల్లో మాత్రం రవాణా పూర్తయిపోయింది! దానికి తగ్గట్టే పౌరసరఫరాల సంస్థ నుంచి రూ.4.81 కోట్ల ప్రజాధనం గుట్టుచప్పుడు కాకుండా కాంట్రాక్టర్ల ఖాతాల్లోకి చేరిపోయింది! కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హన్మకొండ జిల్లాలో వెలుగుచూసిన ఈ భారీ 'రవాణా స్కాం' ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
కాగితాల్లోనే 'ధాన్యం' చక్రాలు!
పౌరసరఫరాల శాఖలో ధాన్యం రవాణా పేరిట జరిగిన ఈ దోపిడీ అంతా ఇంతా కాదు. మిల్లులకు ధాన్యం తరలించినట్లు నకిలీ నంబర్లు, కల్పిత బిల్లులు సృష్టించి ఏకంగా రూ. 4.81 కోట్లను స్వాహా చేశారు. అధికారుల కనుసన్నల్లోనే ఈ అక్రమ రవాణా భాగోతం సాగిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో ప్రజాధనం దుర్వినియోగమవుతున్నా ఉన్నతాధికారులు మాత్రం కనీసం కన్నుతెరిచి చూడకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
నేడు కలెక్టరేట్‌లో సమీక్ష.. పొంగులేటి స్పందించేనా?
ఇంతటి భారీ అక్రమం వెలుగుచూసిన నేపథ్యంలో, నేడు (మంగళవారం) హన్మకొండ కలెక్టరేట్ వేదికగా సమీక్షా సమావేశం జరగనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించనున్నారు. ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు.
ఈ నేపథ్యంలో "ప్రజా ప్రభుత్వం"లో జరిగిన ఈ కోట్లాది రూపాయల నిధుల దుర్వినియోగంపై ఇన్‌ఛార్జి మంత్రి ఏవిధంగా స్పందిస్తారనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
విజిలెన్స్ విచారణే శరణ్యం!
అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు యథేచ్ఛగా నిధులు నొక్కేస్తున్నారని.. ప్రజాధనానికి జవాబుదారీతనం లేకుండా పోయిందని స్థానిక రైతులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ధాన్యం రవాణా కుంభకోణంపై వెంటనే స్పందించి విజిలెన్స్ విచారణ కు ఆదేశించాలని ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ స్కాంలో హస్తమున్న అధికారులు, కాంట్రాక్టర్ల గుట్టు రట్టు చేసి, దుర్వినియోగమైన ప్రజాధనాన్ని రికవరీ చేయాలని కోరుతున్నారు.
ఇన్నాళ్లూ మౌనం వహించిన యంత్రాంగానికి చెక్ పెడుతూ, ఇన్‌ఛార్జి మంత్రి ఈ అక్రమాలపై ఉక్కుపాదం మోపుతారా లేక సమీక్షలకే పరిమితమవుతారా అనేది నేటి సమావేశంలో తేలనుంది!