ఆసుపత్రి నుంచే ఉద్యమకారుడి పిలుపు
అరెస్టుపై తీవ్ర అభ్యంతరం.. సీజేపీ ఆందోళనకు మద్దతు
వాంగ్‌చుక్ ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు
ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తుండగా అరెస్టయిన ప్రముఖ పర్యావరణవేత్త, ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ ప్రస్తుతం సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నుంచే ఆయన తన మద్దతుదారులకు ఒక కీలక సందేశాన్ని పంపారు. ఈ నెల 20న (సోమవారం) చేపట్టదలచిన 'పార్లమెంట్ మార్చ్'ను భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనకు వాంగ్‌చుక్ సంఘీభావం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 21వ రోజుకు చేరుకున్న తరుణంలో ఢిల్లీ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.
రెండో స్వాతంత్ర్య పోరాటం!
ఆసుపత్రి నుంచి విడుదల చేసిన సందేశంలో సీజేపీ నేతృత్వంలో సాగుతున్న ఈ ఉద్యమాన్ని వాంగ్‌చుక్ 'రెండో స్వాతంత్ర్య పోరాటం'గా అభివర్ణించారు.
"భయాందోళనలు, అసమానతలు లేని నవ భారత నిర్మాణమే మన లక్ష్యం. శాంతియుతంగా దీక్ష చేసుకుంటున్న నన్ను అడ్డుకుని, అరెస్టు చేయడం పూర్తిగా అన్యాయం. దేశ భవిష్యత్తు కోసం ప్రజలంతా పెద్ద ఎత్తున తరలివచ్చి పార్లమెంట్ మార్చ్‌ను జయప్రదం చేయాలి" అని ఆయన కోరారు.
అనుమతి లేదు: పోలీసులు.. తగ్గేదే లేదంటున్న సీజేపీ
మరోవైపు సోమవారం నాటి పార్లమెంట్ మార్చ్‌కు ఎలాంటి అనుమతులు లేవని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. అయితే, పోలీసులు అనుమతించకపోయినా వ్యూహాత్మకంగా మార్చ్‌ను నిర్వహించి తీరుతామని సీజేపీ శ్రేణులు తేల్చిచెప్పాయి. దీంతో దేశ రాజధానిలో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు భారీగా మోహరిస్తుండటంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోర్టు ఆదేశాల మేరకే తాము వాంగ్‌చుక్‌ను అరెస్టు చేశామని పోలీసులు సమర్థించుకుంటున్నారు.
ఆరోగ్యం నిలకడగనే ఉంది..
దీర్ఘకాలిక ఉపవాసం కారణంగా సోనమ్ వాంగ్‌చుక్ శరీరంలో ద్రవాల శాతం తగ్గినట్లు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.
ప్రస్తుతం ఆయనకు ఐవీ ఫ్లూయిడ్స్ అందిస్తున్నామని, ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు.
నిపుణులైన వైద్య బృందం నిరంతరం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోందని తెలిపారు.
ప్రారంభంలో ఆయన చికిత్సకు నిరాకరించారని, కౌన్సెలింగ్ ఇచ్చినా వినకపోవడంతో చివరకు కుటుంబ సభ్యుల సహాయంతో వైద్యం అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం వాంగ్‌చుక్ అరెస్టు, పార్లమెంట్ మార్చ్ ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.