🏠 www.manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 16 July 2026, 02:31 PM Posted by: MANA VISHWAM

'కమలాపూర్ సెక్టార్లో' ధాన్యం రవాణా కుంభకోణం

​హన్మకొండ జిల్లా పౌరసరఫరాల శాఖ పరిధిలోని 'కమలాపూర్ సెక్టార్‌'లో భారీ ధాన్యం రవాణా కుంభకోణం జరిగినట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక రైతులు తమ సొంత ట్రాక్టర్లు, ట్రాలీల్లో దాదాపు 60% పైగా ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలిస్తే, అధికారులు మాత్రం రికార్డుల్లో 'వెంకటేశ్వర లారీ ట్రాన్స్పోర్ట్' ద్వారా ప్రైవేట్ లారీల్లో తరలించినట్లు చూపిస్తూ కోట్ల రూపాయల బిల్లులు డ్రా చేశారనేది ప్రధాన ఆరోపణ. 2024-25 మరియు 2025-26 సీజన్లకు సంబంధించి ఇప్పటివరకు సుమారు రూ. 4.39 కోట్లకు పైగా నిధులు చెల్లించగా, మరో రూ. 1 నుండి 2 కోట్ల వరకు పెండింగ్ బిల్లులు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పౌరసరఫరాల శాఖలోని ఓ కీలక అధికారి బినామీగా ఈ వ్యవహారం నడిపినట్లు సమాచారం కాగా, మిల్లుల సీసీటీవీ ఫుటేజీలు, వెయ్‌బ్రిడ్జ్ రికార్డులు, ఈ-వే బిల్లులు మరియు జీపీఎస్ డేటాను సమగ్రంగా విచారిస్తే ఈ భారీ దోపిడీ వెనుక ఉన్న అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని స్థానిక రైతులు ఉన్నత స్థాయి స్వతంత్ర దర్యాప్తును డిమాండ్ చేస్తున్నారు.
🏠 Home