🏠 www.manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 14 July 2026, 12:31 PM Posted by: MANA VISHWAM

హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌ రవీందర్‌ నివాసంలో ఏసీబీ సోదాలు!

హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) చీఫ్‌ ఇంజినీర్‌ బచ్చు రవీందర్‌ లక్ష్యంగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం ఉదయం నుంచి విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే నమ్మదగిన సమాచారంతో అధికారులు రంగంలోకి దిగారు.

​ఒకేసారి 15 చోట్ల తనిఖీలు

​తెల్లవారుజాము నుంచే రంగంలోకి దిగిన ఏసీబీ ప్రత్యేక బృందాలు.. రవీందర్‌ నివాసంతో పాటు హెచ్‌ఎండీఏ ప్రధాన కార్యాలయం, ఆయన బంధువులు, అత్యంత సన్నిహితులకు చెందిన మొత్తం 15 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టాయి.
​ రవీందర్‌ నివాసంలో లభించిన విలువైన డాక్యుమెంట్లు, బ్యాంకు లాకర్ల వివరాలు, ఐటీ రిటర్నులను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.
​ఆయన కార్యాలయంలోని కంప్యూటర్ హార్డ్ డిస్కులు, ల్యాప్‌టాప్‌లతో పాటు పలు కీలక దస్త్రాలను ఏసీబీ బృందాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.ఈ తనిఖీలలో లభ్యమైన నగదు, బంగారం, భూముల విలువకు సంబంధించిన పూర్తి వివరాలను సోదాలు ముగిసిన అనంతరం అధికారికంగా వెల్లడిస్తామని ఏసీబీ ఉన్నతాధికారులు తెలిపారు.
🏠 Home