గర్భస్రావ మాత్రలు ఇచ్చి అఘాయిత్యం.. రౌడీషీట్ తెరుస్తామని ఏసీపీ హెచ్చరిక
వరంగల్ : ప్రేమ పేరుతో నమ్మించి ఓ మైనర్ బాలికపై వరుసగా లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా, ఆమె గర్భం దాల్చడంతో మోసపూరితంగా గర్భస్రావం చేయించిన నిందితుడిని గీసుగొండ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ దారుణానికి సంబంధించిన వివరాలను మామునూరు ఏసీపీ వెంకటేష్ వెల్లడించారు.
నమ్మించి అఘాయిత్యం..
పోలీసుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌కు చెందిన బొడ్డు బన్నీ (21) అనే యువకుడికి, గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక మైనర్ బాలికతో 2023లో పదో తరగతి చదువుతున్న సమయంలో స్నేహితురాలి ద్వారా పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నానంటూ నమ్మించిన నిందితుడు ఆమెతో తరచూ ఫోన్లో మాట్లాడేవాడు. మార్చి 2023లో బాలిక ఎస్సెస్సీ పరీక్షలు రాస్తున్న సమయంలో ఒక రోజు రాత్రి ఆమె ఇంటి వద్దకు వెళ్లిన బన్నీ, పెళ్లి చేసుకుంటానని నమ్మించి సమీపంలోని ఒక వెంచర్‌కు తీసుకెళ్లి బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత కూడా నమ్మించి 2024 వరకు పలుమార్లు ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
కేకులో గర్భస్రావ మాత్రలు కలిపి..
ఈ క్రమంలో 2025 మార్చి నెలలో బాధితురాలు గర్భం దాల్చింది. ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు నిందితుడు బన్నీ క్రూరంగా ఆలోచించాడు. బాలిక పుట్టినరోజు సందర్భంగా ఆమెకు తెలియకుండా బర్త్‌డే కేకులో గర్భస్రావ మాత్రలు (అబార్షన్ పిల్స్) కలిపి తినిపించాడు. ఆ తర్వాత ఆమెకు తీవ్ర కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు గర్భస్రావం జరిగినట్లు నిర్ధారించారు.
బెదిరింపులు, ఫోన్ ధ్వంసం..
గర్భస్రావం జరిగిన తర్వాత కూడా నిందితుడి ప్రవర్తనలో మార్పు రాలేదు. మళ్లీ తన వద్దకు రావాలని బాధితురాలిని వేధించడం ప్రారంభించాడు. నిరాకరించడంతో తిట్టడం, కొట్టడం, చంపేస్తానని బెదిరించడం చేశాడు. నాలుగు రోజుల క్రితం వరంగల్‌లో బాధితురాలిపై దాడి చేసిన నిందితుడు, ఆమె మొబైల్ ఫోన్‌ను కూడా ధ్వంసం చేశాడు.
పోలీసుల కఠిన చర్యలు - రౌడీషీట్ హెచ్చరిక
నిందితుడి వేధింపులు భరించలేక బాధితురాలు గీసుగొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు బొడ్డు బన్నీని సోమవారం అరెస్ట్ చేసి, అతనిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్ ) మరియు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
"మహిళలు, మైనర్ బాలికలపై ఇటువంటి నేరాలకు పాల్పడే వ్యక్తులను ఎంతమాత్రం ఉపేక్షించబోం. నిందితులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, వారిపై రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తాం."అని మామునూరు ఏసీపీ వెంకటేష్ తెలిపారు.ఈ కేసు దర్యాప్తులో మామునూరు ఏసీపీ వెంకటేష్‌తో పాటు గీసుకొండ ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్, ఎస్సై కుమార్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.