🏠 www.manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 11 July 2026, 09:52 AM Posted by: MANA VISHWAM

పోక్సో కేసు కక్ష.. గొడ్డలితో ఊచకోత

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో తనపై పోక్సో (POCSO) కేసు పెట్టారనే కక్షతో రాజ్‌కుమార్ అనే వ్యక్తి గొడ్డలితో దాడి చేసి ఆరుగురిని దారుణంగా హత్య చేశాడు. నిద్రపోతున్న బాధిత బాలిక, ఆమె తల్లి, నానమ్మలతో పాటు అడ్డువచ్చిన తన భార్య, ఇద్దరు చిన్నారులను (మూడేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు) కిరాతకంగా నరికి చంపాడు. అనంతరం నిందితుడు తన తల్లిదండ్రులకు విషయం చెప్పగా, వారు పోలీసులకు సమాచారం అందించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్ ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించి, గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. హత్యల తర్వాత తాను కూడా చనిపోతానని బంధువులకు ఫోన్ చేసి ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.
🏠 Home