🏠 www.manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 07 July 2026, 11:23 AM Posted by: MANA VISHWAM

వృద్ధురాలిపై కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ అత్యాచారయత్నం!

వృద్ధురాలిపై కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ అత్యాచారయత్నం!

నగ్నంగా ఇంట్లోకి చొరబడిన వైనం

నిందితుడిని బాత్రూంలో బంధించి పోలీసులకు అప్పగించిన స్థానికులు



సభ్యసమాజం తలదించుకునేలా ఓ ప్రజాప్రతినిధి బరితెగించాడు. నగ్నంగా ఇంట్లోకి చొరబడి, నిద్రిస్తున్న ఓ వృద్ధురాలిపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఘోర కలియుగ ఘటన స్టేషన్‌ ఘన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలో వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...
మున్సిపాలిటీ పరిధిలోని చాగల్‌ గ్రామానికి చెందిన 9వ వార్డు కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ చౌదరపల్లి సంపత్‌ రాజ్‌ అర్ధరాత్రి దాటిన తర్వాత నగ్నంగా మారి, స్థానికంగా ఉంటున్న ఓ వృద్ధురాలి ఇంట్లోకి చొరబడ్డాడు. గాఢనిద్రలో ఉన్న ఆమెపై అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు.

హడలెత్తిన వృద్ధురాలు.. బాత్రూంలో బందీ!


మృగాడి ప్రవర్తనతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైన వృద్ధురాలు భయంతో గట్టిగా కేకలు వేసింది. ఆమె ఆర్తనాదాలు విన్న కుటుంబసభ్యులు, చుట్టుపక్కల స్థానికులు అప్రమత్తమై తలుపులు బద్దలుకొట్టుకుని లోపలికి వచ్చారు. స్థానికులను చూసి హడలిపోయిన సంపత్‌ రాజ్‌.. వారి నుంచి తప్పించుకునేందుకు నగ్నంగానే ఇంట్లోని బాత్రూంలోకి దూరి తలుపులు వేసుకున్నాడు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన స్థానికులు, బాత్రూంకు బయటి నుంచి గడియ పెట్టి నిందితుడిని లోపలే బంధించారు.

పోలీసుల రంగప్రవేశం.. నిందితుడి అరెస్ట్

వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాత్రూంలో బందీగా ఉన్న కౌన్సిలర్‌ సంపత్‌ రాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఒంటిపై బట్టలు లేకపోవడంతో అతడికి దుస్తులు వేసి, అక్కడి నుంచి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్‌ ఈ తరహా అఘాయిత్యానికి పాల్పడటంతో స్థానికంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
🏠 Home