హనుమకొండలో అరుదైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్‌ను పరామర్శించిన ఏపీ డిప్యూటీ సీఎం
రూ. లక్ష ఆర్థిక సాయం.. కుటుంబానికి భరోసా..
జీవనోపాధికి సహకారం అందించాలని ఆదేశం
హనుమకొండ, జూన్ 17 (మన విశ్వం): ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. తీవ్రమైన అనారోగ్యంతో మంచానికే పరిమితమైన తన అభిమాని కోరికను తెలుసుకున్న ఆయన స్వయంగా హనుమకొండకు వెళ్లి బాలుడిని పరామర్శించారు. దీంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.
హనుమకొండ నగరంలోని హనుమాన్‌నగర్‌కు చెందిన 17 ఏళ్ల నిరంజన్ అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. వ్యాధి కారణంగా అతని శారీరక ఎదుగుదల దెబ్బతిని, చాలాకాలంగా మంచానికే పరిమితమయ్యాడు. ఈ పరిస్థితుల్లో తన అభిమాన నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్‌ను ఒక్కసారైనా కలవాలన్న కోరికను కుటుంబ సభ్యుల వద్ద వ్యక్తం చేశాడు.
నిరంజన్ కోరికను కుటుంబ సభ్యులు తెలంగాణ జనసేన నాయకుల దృష్టికి తీసుకెళ్లగా, వారు ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్‌కు తెలియజేశారు. విషయం తెలుసుకున్న వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్, తన ఇతర కార్యక్రమాలను పక్కనపెట్టి హనుమకొండకు చేరుకుని నిరంజన్‌ను ప్రత్యక్షంగా కలిశారు.
ఈ సందర్భంగా నిరంజన్‌తో ఆప్యాయంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్, అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. వైద్య చికిత్సలకు ఉపయోగపడేలా రూ.1 లక్ష ఆర్థిక సాయం అందజేశారు. అలాగే భగవంతుని తీర్థప్రసాదాలను అందించి, నిరంజన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
నిరంజన్ ఆరోగ్య క్షేమం కోసం వరంగల్‌లోని భధ్రకాళీ ఆలయంలో లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. అదే సమయంలో బాలుడి తల్లిదండ్రుల జీవన పరిస్థితులను తెలుసుకుని, వారి కుటుంబానికి స్థిరమైన ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని జనసేన తెలంగాణ నాయకత్వానికి సూచించారు. కుటుంబం జీవనోపాధి మెరుగుపడేలా క్యాంటీన్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు.
పవన్ కళ్యాణ్ ఆకస్మికంగా తమ ఇంటికి రావడం, పరామర్శించడంతో నిరంజన్ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. కష్టకాలంలో అండగా నిలిచినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ మానవీయ చర్య స్థానికంగా ప్రశంసలు అందుకుంటోంది.